కోనసీమ: బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అమలాపురం మండలం రెడ్డిపల్లి కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కాలనీవాసులు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో కాలనీ ముంపునకు గురైందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, నీరు వెళ్లే మార్గం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జల దిగ్బంధంలో రెడ్డి పల్లి కాలనీ


