హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలి'

BHPL: మల్హర్‌రావు మండలంలోని తాడిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్హర్‌రావు మండల ఇంఛార్జ్ మేనం సంతోష్ డిమాండ్ చేశారు. మండలంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించడం లేదని ఆయన పేర్కొన్నారు.