హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వం బినామీ పట్టాలను వెంటనే రద్దు చేయాలి'

ప్రకాశం: హనుమంతునిపాడు (మం) హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో 230 ఎకరాల ప్రభుత్వ భూమికి బినామీ పేర్లతో జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుబడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 2001 నుంచి పట్టాల రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.