హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విత్తన గుళికల వినియోగంపై అవగాహన

AKP: ఎస్.రాయవరం మండలం ఉప్పరపల్లిలో వరి పంటలో విత్తన గుళికల వినియోగంపై డెమో నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో నారుమడులు వేయని రైతులు నేరుగా విత్తన గుళికలతో వరి సాగు చేసే విధానంపై అవగాహన కల్పించారు. వర్షాలతో నీరు అందుబాటులో ఉన్నందున రైతులు ఈ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ లచ్చన్న పాల్గొన్నారు.