హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులకు పోటీలు

ప్రకాశం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాచర్ల మండలంలోని పలు పాఠశాలల్లో గురువారం డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ZPHS హైస్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్‌లలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.