W.G: నరసాపురం మండల పరిషత్ ప్రత్యేకాధికారిగా జిల్లా వ్యవసాయాధికారి గెడ్డం సునీత గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ఆమెను మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారిగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన సునీతకు ఎంపీడీఓ ఎం. నాసరు రెడ్డి, ఏఓ వి.కె. వీరభద్రరావు, డిప్యూటీ ఎంపీడీఓ నాగేంద్ర కుమార్, ఆనంద్ బాబు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం ఎంపీపీ ప్రత్యేకాధికారిగా సునీత


