హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు శంకుస్థాపన

ఏలూరు పత్తేబాదులో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపన చేశారు. ఉద్యోగాలు, విద్య కోసం వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు హాస్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు. నిర్మాణానికి రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చిన ఏసేపు దంపతులను అభినందించారు.