హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన MLA

ADB: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను MLA అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా STPPకు సంబంధించిన పరిస్థితులు, విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ఉద్దేశంతో పర్యటన చేపట్టినట్లు అనిల్ జాదవ్ తెలిపారు.