హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు'

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టులో MLHP అనిల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో గ్రామంలో దాదాపు 60 మంది ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ANM సరోజ ఉన్నారు.