హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు స్వయంగా వడ్డించిన అదనపు ఎస్పీ

AKP: జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ‘మహా బొజ్జ గణపయ్య’ నిమజ్జన పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు హాజరై ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో ఆయన స్వయంగా భోజనాలు వడ్డించి ఆత్మీయత చాటుకున్నారు.