హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నకుడాలలో వ్యవసాయ కేబుల్ వైర్ల చోరీ

KDP: లింగాల మండలం చిన్నకుడాలలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను అపహరించారు. రైతు శివనారాయణరెడ్డికి చెందిన 250 మీటర్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లగా, వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు. రైతులు నాగేంద్రనాథ్‌రెడ్డి, శంకర్‌రెడ్డికి చెందిన స్టార్టర్ కేబుల్ వైర్లను కూడా దొంగిలించినట్లు రైతులు తెలిపారు.