హైదరాబాద్: 28°C
వ్యాపారం

సెన్సెక్స్‌ 1200 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల విషయంలో అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో మార్కెట్ సూచీలు దాదాపు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్ 1209.80 పాయింట్ల నష్టంతో 73,624.02 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 378.10 పాయింట్లు క్షీణించి 23,068.45 వద్ద కొనసాగుతోంది.