ప్రకాశం: కొమరోలు మండల ప్రత్యేక అధికారిగా వంగ ఆశా జ్యోతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ పదవీకాలం ముగియడంతో ఆమెకు మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ బాబు ఆశా జ్యోతికి ఘన స్వాగతం పలికారు. మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొమరోలు మండల ప్రత్యేక అధికారి నియమకం


