హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలన

KDP: లింగాల మండలంలోని పెద్దకూడలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గురువారం డిప్యూటీ ఎంపీడీఓ రాముడు పరిశీలించారు. తడి – పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, స్వచ్ఛ రథం ద్వారా చెత్త సేకరణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను సక్రమంగా వేరు చేసి స్వచ్ఛ రథం సిబ్బందికి అందించాలని సూచించారు.