హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన పదవీకాలం.. శాలువాతో సత్కారం

ప్రకాశం: కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం పదవీకాలం గురువారం ముగియడంతో మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో కార్యాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్, మండల ప్రత్యేక అధికారి గజ్జల శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డిలు అభినందనలు తెలిపారు. ఎంపీపీ దంతులూరి ప్రకాశం సేవలు ఎనలేనివి అన్నారు.