హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తికేయ‌నగర్‌లో నూతన ఆలయ భూమి పూజ

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ. 38 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.