హైదరాబాద్: 28°C
వ్యాపారం

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం ఎంపీడీవో రాజేశ్వరి సూచించారు. తల్లిదండ్రులు చిన్నారులను సురక్షితంగా ఉంచాలని, విద్యుత్‌ తీగలు, నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 8790345309, 9281479218 నంబర్లకు ఫోన్‌ చేయాలని అన్నారు.