MHBD: గూడూరు మండలం సీతానగరం శివారులోని ప్రముఖ పర్యాటక కేంద్రం భీమునిపాదం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో గురువారం జలపాతం ప్రవాహం భారీగా పెరిగింది. ప్రకృతి నడుమ జలపాతం సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పెరిగిన ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న భీమునిపాదం


