MHBD: పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో గురువారం వర్షపు నీరు మోకాళ్ల లోతు వరకు చేరింది. దీంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఆయుర్వేద ఆసుపత్రిలో మోకాళ్ల లోతు వర్షపు నీరు


