NGKL: బిజినపల్లి మండల కేంద్రంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచి రాకపోకలకు ఆటంకంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాత సినిమా టాకీస్ వద్ద రహదారి చెరువును తలపిస్తుండటంతో నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో నాగర్‌కర్నూల్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బిజినపల్లిలో వర్షపు నీటితో ఇబ్బందులు


