JGL: రాయికల్ 5వ వార్డులో కౌన్సిలర్ కున్నారపు మానస ఆధ్వర్యంలో పోషణ మాసం వేడుకలు జరిగాయి. మార్కెట్‌లో ధరలు పెరిగినందున ఇంటి ఆవరణలోనే ఆకుకూరలు పెంచుకుని పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. మునగాకు, పప్పుల్లో ఐరన్, పోషకాలు మెండుగా ఉంటాయన్నారు. అనంతరం ప్రీస్కూల్ పిల్లల తల్లులకు క్విజ్ జరిపారు. అంగన్‌వాడీ టీచర్లు సుజాత, రమాదేవి, పద్మ, ఉమాదేవి పాల్గొన్నారు.
తెలంగాణ
'ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకోవాలి'


