హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో ‘యువత భవితకు భరోసా’

KRNL: ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. AI, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ, శిక్షణ అవకాశాలు పొందాలని సూచించారు. జాబ్ క్యాలెండర్, DSC, గ్రూప్-1 నియామకాలపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి, జాబ్ మేళాల వివరాలను తెలిపారు.