హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదిగ JAC మహిళా జిల్లా కన్వీనర్‌గా లలిత

ADB: ఆదిలాబాద్‌లో మాదిగ JAC జిల్లా నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాదిగ JAC మహిళా జిల్లా కన్వీనర్‌గా లంక లలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. మహిళల్లో చైతన్యం, విద్య, ఉద్యోగ హక్కులపై కృషి చేస్తానని లలిత అన్నారు. 15 రోజుల్లో మండల కమిటీలు పూర్తి చేసి, అక్టోబర్ 20న పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు.