హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలతో మైదం చెరువుకు జలకళ

JN: కొడకండ్ల మండలంలోని మైదం చెరువు తండా, గిర్ని తండా గ్రామ పంచాయతీల ఉమ్మడి మైదం చెరువు వర్షాలతో జలకళను సంతరించుకుంది. గత రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షాలతో చెరువులోకి భారీగా నీరు చేరడంతో నిండుకుండలా దర్శనమిస్తోంది. చెరువు పూర్తిగా నిండి, అలుగు పోసేందుకు మరిన్ని సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు కోరుకుంటున్నారు.