హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం స్పెషల్.. మెట్రో సర్వీసుల పొడిగింపు

HYD: సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకే ముగిసే మెట్రో సర్వీసులను గణేశ్ నిమజ్జనం సందర్భంగా పొడిగించనున్నారు. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 1 గంట తర్వాత బయలుదేరుతుంది. ట్యాంక్‌బండ్‌కు వచ్చే వారికి ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.