హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజులుగా తాగునీటి కష్టాలు

NRPT: నారాయణపేట మండలం కోటకొండలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండుగ సమయంలోనూ నీరు అందకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరఫరా నిలిచిపోవడానికి కారణాలను అధికారులు వెల్లడించి, వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.