హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల్లో పూజా సామగ్రి వేయొద్దు: GHMC

RR: పూజా పుష్పాలు, నిర్మాల్యం వల్ల జలాశయాలు, పరిసరాలు కలుషితం కాకుండా GHMC ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సేకరించిన పూజా వ్యర్థాలను వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో సేంద్రీయ ఎరువులుగా మారుస్తోంది. స్వచ్ఛ, హరిత హైదరాబాద్ నిర్మాణంలో భాగంగా నగరవాసులు నదులు, చెరువుల్లో పూజా సామగ్రిని వేయకుండా నిర్మాల్య సేకరణ కార్యక్రమానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.