హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగులతో వర్షం.. విద్యుత్ అస్తవ్యస్తం

HNK: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల ధాటికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పాటు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు వర్షంతో పంటలకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తంచేశారు.