MDK: పాపన్నపేట మండలం కుర్తివాడలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వీర గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జనోత్సవంలో గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన మహమ్మద్ ఆమీర్ రూ. 6 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆమీరు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
తెలంగాణ
గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు


