హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇండ్లు సకాలంలో నిర్మించుకోవాలి'

KMR: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకోవాలని ఎంపీడీవో సవితారెడ్డి సూచించారు. గురువారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు.