హైదరాబాద్: 28°C
తెలంగాణ

వజినేపల్లి వాగు ఉద్ధృతి.. రాకపోకలకు ఇబ్బంది

SRPT: చింతలపాలెం మండల పరిధిలోని వజినేపల్లి వాగు ఈరోజు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పులిచింతల – జగ్గయ్యపేట ప్రధాన మార్గంపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.