హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో అక్కడే భారీ వర్షం నమోదు

NLG: నల్గొండ జిల్లాలో గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శాలిగౌరారం మండలంలో అత్యధికంగా 65.0 మి.మీ, కేతేపల్లిలో 61.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక మిర్యాలగూడ (తీక్యాతండా)లో 53.3 మి.మీ, నకిరేకల్లో 53.0 మి.మీ వర్షం కురిస్తుందని వాతావరణ శాఖ అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని సూచించారు.