KDP: సిద్ధవటం మండలంలోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ రెవెన్యూ డీకేటీ భూములను గుర్తించి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని MRO విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా నిబంధనల ప్రకారం ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమిత భూములు వెనక్కి తీసుకుంటాం: MRO


