శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయమైందంటూ వస్తున్న వార్తలపై దేవస్థానం బోర్డు స్పందించింది. అవన్నీ అసత్య వార్తలని, స్వర్ణ కిరీటం భద్రంగా ఉందని తెలిపింది. స్ట్రాంగ్ రూమ్‌ల్లో బంగారు ఆభరణాలతో పాటు ఇమిటేషన్ నగలు కూడా ఉంటాయని అందువల్ల గందరగోళం ఏర్పడి కిరీటం మిస్ అయినట్లు భావించినట్లు చెప్పారు. కానీ, రిజిస్టర్ సరిచూసిన తర్వాత.. కిరీటం భద్రంగా ఉన్నట్లు తేలిందన్నారు.
వార్తలు
శబరిమలలో బంగారం కిరీటం మాయమైందా? క్లారిటీ


