SKLM: ఆమదాలవలస పట్టణంలోని ఉన్న పోలీస్ స్టేషన్‌ను తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షం నీరు ఇవాళ ముంచెత్తింది. స్టేషన్ ఆవరణ తో పాటు లోపలి గదుల్లోకి సైతం పెద్దఎత్తున నీరు చేరింది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో పోలీసు సిబ్బంది విధులు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్ నుంచి నీరు బయటకు వెళ్లేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీస్ స్టేషన్‌ను ముంచెత్తిన వరద నీరు


