AKP: మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం పూర్తికావడంతో నాతవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారిగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని జీ.మంగవేణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్, ఏవో పి.పార్థసారథి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కురుస్తున్న వర్షాలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నాతవరం ప్రత్యేక అధికారిగా మంగవేణి బాధ్యతలు


