నెల్లూరు నగరం నవాబుపేటలో గురువారం పాత కక్షుల నేపథ్యంలో దాడి ఘటన చోటు చేసుకుంది. సాయి సునీల్ అనే వ్యక్తి ప్రదీప్ కళ్ళలో కారం చల్లి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కళ్ళలో కారం చల్లి కత్తితో దాడి...!


