హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్టపరిహారం చెక్కు అందజేత

WNP: కేతేపల్లి గ్రామానికి చెందిన దొండాయిపల్లి రవీందర్ రెడ్డికి చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట గత వేసవిలో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. నష్టపరిహారం కోసం ఆయన రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రూ. 1.25 లక్షల పరిహారం మంజూరు కావడంతో తహశీల్దార్ కార్తీక్ రావు చెక్కును అందజేశారు.