హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగరపువలసలో అగ్నిప్రమాదం

VSP: తగరపువలసలోని ప్రధాన రహదారి పక్కన గల లైఫ్ స్టైల్ బట్టల షాప్ మేడ మీద పెంట్ హౌస్‌లో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి కొంత ఫర్నిచర్ దగ్ధమైంది. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.