MBNR: జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి గ్రామంలో కే.శివాజీకి చెందిన కిరాణా దుకాణంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.30 వేలకు పైగా నగదు, కిరాణా సరుకులను అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కిరాణా షాపులో చోరీ


