హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ

NRML: సారంగాపూర్ మండలం చించోలి(బి) జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులు స్వచ్ఛత నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి సౌజన్యలు పాల్గొన్నారు.