తనకు కెప్టెన్సీ చేసే సత్తా కూడా ఉందని యువ క్రికెటర్ రింకూ సింగ్ అన్నాడు. యూపీ లీగ్‌లో తాను కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు టైటిల్ అందించానని గుర్తుచేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో తాను వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించానని.. రహానే, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ల నుంచి ఎన్నో నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని, ఆ దిశగా మరింత ఎదగాల్సి ఉందని రింకూ వివరించాడు.
క్రీడలు
‘నాకు కెప్టెన్సీ చేసే సత్తా ఉంది’


