హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పొంచి ఉన్న ప్రమాదం!

GDWL: రాజోలి SC సంక్షేమ వసతి గృహంలోని నీటి ట్యాంకు ప్రమాదకరంగా మారింది. పాతకాలం నాటి ట్యాంకు చుట్టూ ఉన్న రక్షణ రెయిలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. ట్యాంకు కింద విద్యార్థులు నిత్యం ఆటలాడుతుండటంతో ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శిథిలమైన రెయిలింగ్‌ను తొలగించి, పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు అన్నారు.