కృష్ణా: భారీ వర్షాల నేపథ్యంలో ప్రముఖ పర్యాటక తీరం కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్ గేట్లను అధికారులు గురువారం మూసివేశారు. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడి పరిస్థితి తెలియకుండా దూర ప్రాంతాల నుంచి సాగరతీరానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గేట్లు మూసివేశారు.
ఆంధ్రప్రదేశ్
హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత


