హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుబ్బల మంగమ్మ తల్లి గుడి మూసివేత

ELR: నిరంతర వర్షాల కారణంగా కామవరం అడవిలో పుణ్యక్షేత్రం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ కమిటీ దర్శనాలు నిలిపివేశారు. వరద తగ్గాకే ఆలయం తెరుస్తామని, భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ కోరారు.