కృష్ణా: వర్షాల కారణంగా పామర్రు మండల రెవెన్యూ కార్యాలయం గురువారం నీట మునిగింది. కార్యాలయ ప్రాంగణం మొత్తం వర్షపు నీటితో నిండిపోవడంతో చెరువును తలపిస్తోంది. కార్యాలయానికి చేరుకోవాలంటే పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నీట మునిగిన రెవెన్యూ కార్యాలయం


