హైదరాబాద్: 28°C
క్రీడలు

‘కేవలం టీ20లకే పరిమితం కాను’

ఐపీఎల్‌లో కొట్టిన ఐదు సిక్సర్లతోనే తనను అంచనా వేయొద్దని టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ అన్నాడు. తనకు మూడు ఫార్మాట్లలో రాణించగల సత్తా తనకుందని ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్‌పై దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించడంతో తనకు గుర్తింపు వచ్చిందని, కానీ తాను ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగాలని ఉందన్నాడు.