ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. మిక్స్‌డ్ స్కీట్ ఈవెంట్‌లో భారత జోడీకి కాంస్య పతకం వరించింది. ఈ విభాగంలో పోటీపడిన పరీనాజ్ ధలీవాల్, అనంత్‌జీత్ సింగ్ ద్వయం అద్భుత ప్రదర్శనతో తృతీయ స్థానంలో నిలిచారు. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. కాంస్యం గెలిచిన ఈ జోడీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
క్రీడలు
భారత్‌కు మరో పతకం


