ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. ఉషూ క్రీడలో భారత అథ్లెట్ రోషిబినా దేవి నౌరెమ్ రజతం కైవసం చేసుకుంది. మహిళల 60 కేజీల సొండా విభాగం ఫైనల్ పోరులో ఆమె చైనాకు చెందిన అథ్లెట్ జాంగ్ జియావోయు చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో రోషిబినా రజత పతకం దక్కించుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది.
క్రీడలు
భారత్ ఖాతాలో మరో రజత పతకం


