హైదరాబాద్: 28°C
క్రీడలు

గోవా వేదికగా IPL 2027 సీజన్ వేలం

IPL 2027 సీజన్‌ వేలం నిర్వహణపై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు. గోవా వేదికగా ఈసారి వేలం జరుగుతుందని ప్రకటించారు. గత మూడుసార్లు వేలం ప్రక్రియ విదేశాల్లో జరిగింది. అయితే, మహిళా ప్రిమియర్ లీగ్‌ వేలం జరిగే కోచ్చిలోనే IPL 2027 సీజన్ వేలం ఉండొచ్చని అంతా భావించారు. కానీ గోవా వేదికగా వేలం నిర్వహిస్తామని BCCI తెలిపింది. తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.